: ప్రేమ పేరిట వేధింపులు.. గోదావరిఖనిలో విద్యార్థిని ఆత్మహత్య!
గోదావరిఖనిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఉదయ్ నగర్ కు చెందిన విద్యార్థిని సౌమ్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కాగా, గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో ఉన్న గౌతమి సాయి డిగ్రీ కళాశాలలో సౌమ్య ఈమధ్యనే మొదటి ఏడాది పూర్తి చేసింది. అదే కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్న చిట్యాల రోహిత్ తనను ప్రేమ పేరిట వేధిస్తున్నాడని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పినట్టు సమాచారం. వేధింపులు భరించలేకనే సౌమ్య ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.