: టీటీడీ కొత్త ఈవోకు మద్దతుగా నిలిచిన నటుడు మోహన్ బాబు


తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను ఏపీ ప్రభుత్వం నియమించడం, ఆ వెంటనే ఉత్తరాదికి చెందిన వ్యక్తిని ఈ పోస్టులో నియమించారంటూ పలు విమర్శలు తలెతడం విదితమే. ముఖ్యంగా, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయమై ఘాటుగా విమర్శించారు. తాజాగా, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు స్పందిస్తూ, అనిల్ కుమార్ సింఘాల్ కు మద్దతుగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో కలెక్టర్ గా సింఘాల్ సేవలందించారని, సింఘాల్ నిజాయతీపరుడుని, అంకిత భావం కలిగిన అధికారి అని మోహన్ బాబు ప్రశంసించారు. టీటీడీ ఈవోగా సింఘాల్ కు సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News