: కేజ్రీవాల్ కు ఐటీ శాఖ షాక్
ఆప్ అధినేత కేజ్రీవాల్ కు మరో సమస్య వచ్చి పడింది. 2015 ఎన్నికల్లో ఆప్ కు వచ్చిన రూ. 2 కోట్ల విరాళాలకు సంబంధించి లెక్కలను చెప్పాలంటూ ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. విదేశాల నుంచి ఎవరెవరు ఎంతెంత విరాళాలను ఇస్తున్నారో తెలపాలంటూ ఇప్పటికే ఆప్ కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వరుస సమస్యలు, వివాదాలు కేజ్రీవాల్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.