: టీటీడీ ఈవో వ్యవహారం... పవన్ ట్వీట్ పై బీజేపీ అభ్యంతరం!
టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నియామకానికి సంబంధించి ప్రజలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. నిబంధనల మేరకే టీటీడీ ఈవోగా సింఘాల్ ను నియమించారని బీజేపీ నేత భానుప్రకాష్ అన్నారు. పాకిస్థాన్ కు చెందిన వ్యక్తిని ఈవోగా నియమించినట్టు రాద్ధాంతం చేయడం పవన్ కు తగదని చెప్పారు. భారత రాష్ట్రపతిగా గతంలో నీలం సంజీవరెడ్డి ఎన్నికయ్యారని... అలాంటప్పుడు టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన వ్యక్తిని నియమిస్తే తప్పేంటని ప్రశ్నించారు.