: వెయ్యి కుట్రలు కలిపితే ఓ చంద్రబాబు అవుతాడు: వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ


వెయ్యి కుట్రలు కలిపితే ఓ చంద్రబాబు అవుతారని, కుట్రలు అనే పదానికి పేటెంట్ చంద్రబాబునాయుడు అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ-మెయిల్స్ వ్యవహారంపై టీడీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై ఫిర్యాదు చేసింది మానవ హక్కుల సంఘాలేనని, ఇలాంటి సంఘటనలు చంద్రబాబుకే కాదు, గతంలో మోదీకి కూడా ఎదురయ్యాయని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరచొద్దని, ఈ-మెయిల్ దర్యాప్తు పేరుతో వైఎస్సార్సీపీపై ఇష్టానుసారం మాట్లాడితే సహించబోమని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News