: ఫడ్నవీస్ సర్కారు కీలక నిర్ణయం... స్కూల్ క్యాంటీన్లలో జంక్ ఫుడ్ నిషేధం


మహారాష్ట్రలోని అన్ని పాఠశాలల క్యాంటీన్లలోను ఊబకాయాన్ని పెంచే జంక్ ఫుడ్స్ అమ్మకాలను నిషేధిస్తూ, ఫడ్నవీస్ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల క్రితం కేంద్రం జారీ చేసిన సిఫార్సుల అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. హెచ్ఎఫ్ఎస్ఎస్ (హై ఇన్ ఫ్యాట్, సాల్ట్ అండ్ షుగర్) ఆహారాన్ని పాఠశాలల్లో అమ్మకుండా నిషేధం విధించామని, వీటిల్లో తక్కువ స్థాయిలో విటమిన్స్, మినరల్స్ ఉండటమే కారణమని తెలిపింది. జంక్ ఫుడ్ కు అలవాటు పడ్డ విద్యార్థులు విద్యాభ్యాసంలో వెనుకబడి పోతున్నారని, తామిచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు అన్ని స్కూళ్ల ప్రిన్సిపల్స్ చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది.

ప్రస్తుతం క్యాంటీన్లలో అందుబాటులో ఉంచుతున్న పఫ్ లు, బర్గర్, పిజ్జా, ఫింగర్ చిప్స్ తదితరాల స్థానంలో చపాతీలు, అన్నం, రాజ్మా, గోధుమ ఉప్మా, కిచడీ, పాయసం, ఇడ్లీ, వడా సాంబారు, కొబ్బరి నీరు, నిమ్మరసం, జల్ జీరా వంటివి అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. ఈ విషయంలో విద్యార్థుల్లో అవగాహన పెరిగేందుకు పాఠశాలలు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News