: సుప్రీం తీర్పును ముందే ఊహించి చెన్నై వెళ్లిపోయిన కర్ణన్!


తనపై సుప్రీంకోర్టు తీసుకునే చర్యలను ముందుగానే ఊహించిన జస్టిస్ సీఎస్ కర్ణన్ నిన్న రాత్రే కోల్ కతా నుంచి చెన్నైకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఆయన్ను పశ్చిమ బెంగాల్ డీజీపీ స్వయంగా అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు కర్ణన్ కనిపించలేదు. ఇక కర్ణన్ పై వార్తలు రాసే విషయంలో సంయమనం పాటించాలని కూడా సుప్రీంకోర్టు ఈ ఉదయం ప్రసార మాధ్యమాలకు సూచించింది. కర్ణన్ చెన్నైకి విమానంలో వెళ్లారా? అన్న విషయాన్ని నిర్ధారించుకుని చెన్నై పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాల గురించిన సమాచారాన్ని పంపుతామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News