: పలాస ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత... విశాఖ కేర్ లో అత్యవసర చికిత్స
పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ గత రాత్రి తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని, గుండెల్లో నొప్పిగా ఉందని అర్థరాత్రి పూట ఆయన చెప్పడంతో, బంధువులు ఆయన్ను చికిత్స కోసం విశాఖ కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వార్డులో ఆయన్ను ఉంచిన వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఆయన పరిస్థితి మెరుగుపడుతోందని వైద్య వర్గాలు వెల్లడించాయి. పలువురు నేతలు, అభిమానులు ఆయన పరిస్థితిని తెలుసుకునేందుకు ఆసుపత్రి వద్దకు వచ్చారు. శ్యామసుందర్ శివాజీ ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.