: బెల్, డెల్ వచ్చేసరికి వైసీపీ డల్ అయింది: బొండా ఉమ


విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి తప్పుడు ఈ-మెయిల్స్ పంపడం... భారత సార్వభౌమాధికారం మీద దాడి అంటూ వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ మండిపడ్డారు. తప్పుడు మెయిల్స్ పంపిన వారిని వదిలేది లేదని అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేశామని, దీనికి కారకులైన ఆరుగురిని గుర్తించామని... వీరందరి సంగతి త్వరలోనే తేలుస్తామని హెచ్చరించారు. అమెరికాలో చంద్రబాబు పర్యటన విజయవంతంగా కొనసాగుతోందని బొండా ఉమ తెలిపారు. ఏపీకి యాపిల్, బెల్, డెల్ వచ్చే సరికి వైసీపీ డల్ అయిందని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడిపోయారని అన్నారు. 

  • Loading...

More Telugu News