: మరణించిన వ్యక్తిపై 'స్టుపిడ్ మిశ్రా' ఆరోపణలు చేస్తున్నాడు: సునీత కేజ్రీవాల్ మండిపాటు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కు కోపం వచ్చింది. కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ మీడియాకెక్కిన కపిల్ మిశ్రాపై ఆమె మండిపడ్డారు. కేజ్రీవాల్ తన బావమరిదికోసం 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దానిపై ఏసీబీకి ఆధారాలు సమర్పిస్తున్నానని చెప్పిన కపిల్ మిశ్రా... సత్యేంద్ర జైన్ తనతో మాట్లాడుతూ, కేజ్రీవాల్ బంధువు భూవివాదాన్ని 50 కోట్లకు సెటిల్ చేశానని అన్నారని తెలిపారు. దీనిపై సునీత కేజ్రీవాల్ మండిపడ్డారు. కపిల్ మిశ్రాను ఆమె స్టుపిడ్ గా అభివర్ణించారు. ఆయన ఎవరో రాసిన స్క్రిప్టులను చదువుతున్నారని తెలిపారు. కేజ్రీవాల్ బావమరిది మరణించారని తెలిపారు. మరణించిన వ్యక్తి వివరణ ఇవ్వడు కనుక ఆయనపై మిశ్రా ఆరోపణలు చేస్తున్నారని ఆమె తెలిపారు.