: పాక్ సైనికుల తల నరకండి.. 5 కోట్లు ఇస్తాం: రాజస్థాన్ ముస్లిం సంస్థ సంచలన ప్రకటన
రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న 'ముస్లిం యువ ఆటంకవాది విరోధి' సంస్థ సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్ సైనికుల తల నరికిన భారతీయ జవాన్లకు రూ. 5 కోట్ల నజరానా ఇస్తామంటూ ఆ సంస్థ చీఫ్ ముహమ్మద్ షకీల్ సైఫీ ప్రకటించారు. అజ్మీర్ దర్గాను షకీల్ సైఫీ నేడు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. భారత జవాన్లకు రివార్డు ఇవ్వడం కోసం తమ సంస్థ వాలంటీర్లు ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నారని చెప్పారు. మన సైనికుల తలలు నరికిన పాక్ సైనికులకు బుద్ధి చెప్పాలని... వారి దాడులకు ప్రతీకారంగా వారి తలలను నరకాలని ఆయన అన్నారు.