: కేజ్రీవాల్ పై మరో అవినీతి ఆరోపణ.. లెఫ్టినెంట్ గవర్నర్ కు సుబ్రహ్మణ్యస్వామి లేఖ


అవినీతి ఆరోపణలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తన కళ్ల ముందే సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్లు లంచాన్ని కేజ్రీవాల్ తీసుకున్నారంటూ ఆప్ నేత, మాజీ మంత్రి కపిల్ మిశ్రా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ పై కేసు కూడా పెడుతున్నానంటూ ఆయన సంచలన ప్రకటన కూడా చేశారు.

మరోవైపు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా మరో అవినీతి ఆరోపణను తెరపైకి తెచ్చారు. ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి కేజ్రీవాల్ రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారంటూ స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కు లేఖ రాశారు. కేజ్రీవాల్ పాల్పడిన ఈ అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలని లేఖలో కోరారు. రూ. 50 లక్షల చొప్పున నాలుగు దఫాలుగా కేజ్రీవాల్ నగదును పుచ్చుకున్నారని... క్విడ్ ప్రోకోలో భాగంగానే ఈ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. కేజ్రీవాల్ పై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయని స్వామి తెలిపారు.

  • Loading...

More Telugu News