: ఆదివారం రజనీకాంత్, సోమవారం స్టాలిన్... చెన్నైలో బిజీగా నగ్మా!


ఆదివారం నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిసి దాదాపు గంట పాటు మాట్లాడిన నటి, మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తో అరగంట పాటు భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో తమిళనాడులోనే ఉంటూ రాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించిన ఆమె, స్టాలిన్ ను కలవడం కొత్త చర్చకు తెరలేపింది.

అన్నా అరివాలయంకు వచ్చిన నగ్మాకు స్టాలిన్ స్వాగతం పలికారు. మర్యాద పూర్వకంగానే స్టాలిన్ ను కలిసినట్టు నగ్మా వెల్లడించినా, తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించుకున్నట్టు తెలుస్తోంది. మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయడం, కార్యకర్తలను పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నగ్మా, తాము డీఎంకే కలసి సాగుతున్నట్టు గుర్తు చేశారు. రాష్ట్రంలో పాలన దారుణంగా ఉంధని ధ్వజమెత్తుతూ, ప్రజాప్రతినిధులంతా పాలనను పక్కనబెట్టి, తమ పదవులను కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారని, ప్రజలపై శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News