: ఫలించని జీహెచ్ఎంసీ 'ఇంప్లోజన్' ప్లాన్... ప్రమాదకరంగా మారిన ఐదంతస్తుల భవంతి!


హైదరాబాద్ లోని కావూరీ హిల్స్ బఫర్ జోన్ లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని అత్యాధునిక పద్ధతిలో కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఉన్నచోటే దీన్ని కుప్పకూల్చేందుకు ‘ఇంప్లోజన్‌’ పద్ధతిని వాడగా, ఆశించిన ఫలితాలు దక్కలేదు. పిల్లర్లకు రంధ్రాలు చేసి జిలెటిన్‌ స్టిక్స్‌ ను కూర్చి పేల్చగా, గ్రౌండ్‌ ఫ్లోర్ మాత్రమే కూలి, మిగతా నాలుగంతస్తులు పక్కకొరిగి ప్రమాదకరంగా మారాయి. మొత్తం భవంతిని రెండు నిమిషాల్లో కూలుస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించడంతో, వందలాది మంది ఈ దృశ్యాన్ని చూసేందుకు వచ్చారు.

ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ బాంబులు అమర్చే పనులు సాగాయి. పక్కనున్న భవంతికి ఏ విధమైన హానీ తగలకుండా చూడాలన్న ఉద్దేశంతో ఓ వైపు పిల్లర్లకు జిలెటిన్లు అమర్చలేదు. మేయర్ బొంతు రామ్మోహన్, చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఎస్‌ దేవేందర్‌ రెడ్డి, వెస్ట్‌ జోన్ కమిషనర్‌ గంగాధర్‌ రెడ్డి తదితరుల సమక్షంలో మధ్యాహ్నం 2.53కు భవనాన్ని పేల్చివేశారు. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే చేపట్టామని, మరో 3 భవనాలను ఇంప్లోజన్ పద్ధతిన కూల్చాక పూర్తి స్థాయి కూల్చివేతలు ఇదే పద్ధతిలో సాగుతాయని అధికారులు తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో కార్మికులు, జేసీబీల సాయంతో భవంతిని కూలుస్తామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News