: అరె... సింహం భయపడింది.. వీడియో చూడండి!
అడవి జంతువులన్నింటికీ రారాజు ఎవరు అంటే చిన్నపిల్లాడు కూడా తడుముకోకుండా 'మృగరాజు సింహం' అని ఠక్కున చెబుతాడు. దేనికీ తలవంచని గాంభీర్యం, భయపడని నైజం, వేటాడే విధానం, రాజసం, ఠీవి, ఆహారం తీసుకోవడం వంటి లక్షణాలన్నీ దానిని అడవికి రారాజును చేశాయి. అయితే ఎవరికీ భయపడదని చెప్పుకునే సింహం చిన్న బుడగకు భయపడిందంటే నమ్మగలమా? అవును నిజమే!
బ్రిటన్ లోని ప్యారడైజ్ జంతుప్రదర్శన శాలలో ఉన్న మోటో అనే సింహం ఆహారం కోసం చుట్టూ తిరుగుతోంది. ఇంతలో పై నుంచి నీటి బుడగలు కిందికి రావడాన్ని చూసింది. అవి అలా వస్తుండగా వాటి దగ్గరకు ఏంటా? అని చూసేందుకు వెళ్లిన సింహం...ఆ బుడగలు నేలను తాకేవరకు అలాగే పరీక్షగా చూసింది. అయితే నీటిని తాకిన ఆ నీటి బుడగలు ఒక్కసారిగా పేలిపోయాయి. అంతే.. సింహం కంగారెత్తిపోయింది. ఉలిక్కిపడి వెనక్కి గెంతింది. ఏప్రిల్ 10న మోటో పది వసంతాలు పూర్తిచేసుకుని, 11వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వీడియోను జూ సిబ్బంది సోషల్ మీడియాలో పోస్టు చేయగా...అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో మీరు కూడా చూడండి.