: మావోలను కాటేసేందుకు సిద్ధమవుతున్న ‘కోబ్రా’.. సుక్మాలో 2 వేల మంది కమాండోలను దింపనున్న సీఆర్‌పీఎఫ్!
చత్తీస్‌గఢ్‌లో గత నెల 24న మావోల ఘాతుకానికి 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులు కావడాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. నాటి దాడికి ప్రతీకారం కోసం వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా గెరిల్లా యుద్ధ తంత్రంలో నిపుణులైన ‘కోబ్రా’ దళాన్ని సుక్మాలో మోహరించాలని సీఆర్‌పీఎఫ్ నిర్ణయించింది. అతి త్వరలో 2 వేల మంది కోబ్రా కమాండోలను సుక్మాలో మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 20-25 కంపెనీల కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) సిబ్బందిని రంగంలోకి దింపాలని నిర్ణయించినట్టు పారామిలటరీ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్, బిహార్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో ఉన్న కోబ్రా సిబ్బందిని బస్తర్ ప్రాంతానికి తరలించనున్నట్టు ఆయన తెలిపారు.