: వాణిజ్య పన్నుల శాఖలో వందల కోట్లు కొల్లగొట్టి సినిమా తీశాడు!
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో వందల కోట్లు కొల్లగొట్టిన ఎస్‌ఎల్ శివరాజు అక్రమ సంపాదనను సినీ పరిశ్రమలోకి మళ్లించాడని సీఐడీ అధికారులు గుర్తించారు. అక్రమ సంపాదన కోసం నకిలీ చలాన్ల స్కాంలో వందల కోట్లు కొల్లగొట్టిన శివరాజు సినీ పరిశ్రమలోని ప్రముఖులతో పరిచయాల కోసం సినిమాను నిర్మించినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.
‘అమ్మా నీకు వందనం’ పేరుతో శివరాజు గతంలో కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో సినిమాను నిర్మించాడని వారు విచారణలో తెలుసుకున్నారు. ఈ సినిమా నిర్మాణానికి 20 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేసినట్టు గుర్తించారు. ఎలాంటి సినీ పరిజ్ఞానం లేని శివరాజు సినిమా నిర్మించడంపై సినీ పరిశ్రమలో దుమారం రేగిందని, ఆయన కోట్లాది రూపాయల స్కాం బయటపడడంతో సినీ పరిశ్రమ నివ్వెరపోతోందని తెలుస్తోంది.