: కత్రినా కైఫ్ కారు డ్రైవర్ చేతిలో చెంపదెబ్బలు తిన్న అభిమాని
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కారు డ్రైవర్ చేతిలో అభిమాని చెంపదెబ్బలు తిన్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... శనివారం రాత్రి కత్రినా కైఫ్ తన డెర్మటాలజిస్ట్ ను కలిసి వెళ్తుండగా ఆమెను ఒక అభిమాని గుర్తించాడు. దీంతో ఆమెతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టి, లైకులు, కామెంట్లు పొందాలనుకున్నాడు.
ఇంతలో కత్రినా అక్కడి నుంచి వెళ్లిపోతుండడంతో... ఆమె కారును ఫాలో అయ్యాడు. కత్రినా కారు తన అపార్టుమెంట్ లోకి వెళ్లిన తరువాత గేట్ దగ్గర నిలబడి...తానో అభిమానని, సెల్ఫీ దిగాలనుందని చెబుతూ గట్టిగా కేకలు వేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కత్రినా డ్రైవర్ నేరుగా వచ్చి అభిమాని చెంపచెళ్ళుమనిపించి బయటకు తోసేశాడు. దీంతో షాక్ తిన్న అభిమాని...ఏడుస్తూ వెనుదిరిగాడు.