: పూణె మహిళా టెక్కీపై 'హత్యా'చారం కేసులో ముగ్గురిని దోషులుగా ప్రకటించిన కోర్టు!
సుమారు ఎనిమిదేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన మహిళా టెక్కీ నయనా పూజూరి (28) పై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులు ముగ్గురిని దోషులుగా తేల్చుతూ స్పెషల్ జడ్జి ఎల్ఎల్ యెంకర్ తీర్పు నిచ్చారు. ఈ ముగ్గురిపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య, తదితర నేరాల కింద మోపిన కేసులు నిరూపితమయ్యాయి. అయితే, ఈ ముగ్గురు దోషులకు ఏ శిక్ష విధించాలన్నది కోర్టు రేపు నిర్ణయించనుంది.
కాగా, ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు.. పూణె-అహ్మద్ నగర్ స్టేట్ హైవేపై ఉన్న ఖరాడి ప్రాంతంలోని ఓ ఐటీ సంస్థలో నయనా పూజూరి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసేది. 2009 అక్టోబర్ 7న ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వెళ్లేందుకు వేచి ఉన్న సమయంలో కిడ్నాప్ నకు గురైంది. రెండు రోజుల తర్వాత పుణె జిల్లా ఖఏడ్ తహసీల్ లోని జరేవాడీ అటవీ ప్రాంతంలో పూజూరి మృతదేహం బయపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు కోసి అడవిలో పడేసి పరారయ్యారు. ఆమె వద్ద ఉన్న ఏటీఎం కార్డు, డబ్బులు తీసుకుని పారిపోయారు.