: ఆ వార్తలు బాధించాయి.. నిహారికను చెల్లెలుగా భావిస్తా: సాయిధరమ్ తేజ్


‘మెగా’ ఫ్యామిలీకి చెందిన సాయిధరమ్ తేజ్ కు, నిహారికకు త్వరలో వివాహం జరగనుందనే వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ప్రతినిధి ద్వారా ఓ ప్రకటన విడుదల చేయించారు. ఈ వార్తలతో సాయి తీవ్రంగా కలత చెందారని, నిహారిక, తాను అన్నాచెల్లెళ్లు మాదిరి ఒకే కుటుంబంలో కలిసి పెరిగామని పేర్కొన్నారు. ఒక అమ్మాయికి సంబంధించి ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు స్పష్టంగా తెలుసుకోకపోతే, అవి మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు. సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక ‘ఒక మనసు’ చిత్రం ద్వారా సినీ హీరోయిన్ గా పరిచయమైంది.

  • Loading...

More Telugu News