: మేము విడిగానే ఉంటున్నప్పటికీ ఫోన్ లో టచ్ లో వుంటాం!: రమ్యకృష్ణ


ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, నటి రమ్యకృష్ణలది ప్రేమ వివాహం అనే విషయం తెలిసిందే. అయితే, వారి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం, వాళ్లిద్దరూ కలిసి ఉండటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ స్పందిస్తూ, తాను ప్రస్తుతం సినిమాలు, సీరియళ్లలో నటిస్తూ బిజీగా ఉన్నానని, అందుకే, చెన్నైలో ఉంటున్నానని చెప్పింది.

తాను, తన భర్త వీలైనప్పుడల్లా హైదరాబాద్ లేదా చెన్నైలో కలుసుకుంటూ ఉంటామని, అప్పుడప్పుడు వెకేషన్లకు కూడా వెళుతుంటామని చెప్పింది. తన ఆశయాలకు అనుగుణంగా, కోరికలను అర్థం చేసుకునే భర్త తనకు లభించాడని చెప్పిన రమ్యక‌ృష్ణ, తామిద్దరమూ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించే వ్యక్తులమని చెప్పుకొచ్చింది.  

  • Loading...

More Telugu News