: వెయ్యి కోట్ల సంతోషం.. ‘బాహుబలి’ చిత్ర బృందం లేటెస్ట్ ట్రైలర్ విడుదల
‘బాహుబలి-2’ చిత్రం వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించి భారతీయ చలన చిత్ర చరిత్రలో బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. ఈ విజయోత్సాహంతో ఆనందంలో ఉన్న ‘బాహుబలి’ చిత్ర బృందం తాజాగా ఓ ట్రైలర్ ను విడుదల చేసింది. ‘బాహుబలి: ది కన్ క్లూజన్ నెం1 బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా’ పేరుతో 30 సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఇందులో బిజ్జలదేవుడు, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి చెప్పే డైలాగ్స్ కనపడతాయి. కాగా, గత నెల 28న విడుదలైన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టడం విశేషం. అమెరికాలో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ‘బాహుబలి-2’ రికార్డులకెక్కడం మరో విశేషం.