: ‘కూల్’గా విజయవాడ బస్టాండ్ !
ఎండలు బెంబేలెత్తిస్తున్న తరుణంలో తమ ప్రయాణికులకు కొంత ఉపశమనం కల్గించేందుకు ఏపీఎస్సార్టీసీ చర్యలు చేపట్టింది. విజయవాడలోని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బస్టాండులో ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేసింది. అరైవల్ బ్లాకులో ఈ కూలర్లను ఏర్పాటు చేశారు. దీంతో, ఎండల నుంచి ప్రయాణికులకు కొంత ఉపశమనం లభిస్తోంది. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులకు తమ ధన్యవాదాలు తెలియజేశారు. ఇతర బస్టాండ్ లలో కూడా ఈ తరహా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు.