: మా సినిమా కూడా చూడండి సారూ!: కర్ణాటక సీఎం నివాసం ముందు క్యూ కడుతున్న నిర్మాతలు!


కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇటీవల యూఏఈ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ‘బాహుబలి-2’, ‘నిరుత్తర’ చిత్రాలను ఒకే రోజు వీక్షించిన విషయం తెలిసిందే. అయితే, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘రాజకుమార’ చిత్రాన్ని ఆయన ఈ మధ్య చూశారు. ఈ సినిమాకు ఆయన హాజరైన ఓ ఫొటోని, సీఎంఓ కార్యాలయ సిబ్బంది సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ ఫొటో పెట్టడమే ఆయనకు పెద్ద తలనొప్పిగా తయారైంది.

ఎందుకంటే, ఆయా చిత్రాల నిర్మాతలు తమ సినిమా చూడాలంటే, తమ సినిమా చూడాలని సిద్ధరామయ్యను ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయానికి, నివాసానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇందుకు సిద్ధరామయ్య స్పందిస్తూ, కాలేజీ రోజుల్లో తాను తరచుగా సినిమాలు చూస్తుండే వాడినని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకు తీరిక ఉండటం లేదని చెప్పారు. పనుల నిమిత్తం బిజీగా ఉన్న తాను, ఎప్పుడుపడితే అప్పుడు సినిమాలు చూడటం కుదరదని, తమ సినిమాలు చూడాలని తనను ఆహ్వానిస్తున్న నిర్మాతలకు ధన్యావాదాలు చెప్పి పంపిస్తున్నారు.

  • Loading...

More Telugu News