: నేను పార్టీ వీడను.. కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలి: కపిల్ మిశ్రా
ఆమ్ ఆద్మీ పార్టీని తాను వీడే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేత కపిల్ మిశ్రా స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తానేమీ బీజేపీ ఏజెంట్ ని కాదని, కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని, కేజ్రీవాల్ బావమరిదికి వాటర్ బిల్లుల పేరిట రూ.10 కోట్లు ఇచ్చారని, కేజ్రీవాల్ అవినీతిపై రేపు సీబీఐ అధికారులను కలుస్తానని అన్నారు. కేజ్రీవాల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఆప్ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ సందర్భంగా కపిల్ మిశ్రా ఆరోపించారు.