: ప్లాస్టిక్ క్యాబేజ్ కూడా వచ్చింది... జాగ్రత్త!
ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ కోడి గుడ్లు మార్కెట్ లోకి వచ్చాయనే వార్తలతో వినియోగదారులు ఇప్పటికే హడలిపోతున్నారు. ఇది చాలదన్నట్టు, తాజాగా, ప్లాస్టిక్ క్యాబేజ్ కూడా మార్కెట్లోకి వచ్చింది. ఈ విషయం ఎలా బయటపడిందంటే.. ఢిల్లీలోని ఓ సూపర్ మార్కెట్ లో ఓ మహిళ క్యాబేజ్ కొనుగోలు చేసింది. ఇంటికి వెళ్లి క్యాబేజ్ కట్ చేద్దామని చూస్తే.. ఎంతకీ తెగలేదు. దీంతో, ఆ క్యాబేజీని స్టౌపై పెట్టడంతో అది ప్లాస్టిక్ తో తయారు చేసిన క్యాబేజ్ అని అర్థమై నిర్ఘాంతపోయింది. వినియోగదారులకు ఇటువంటి చేదు అనుభవం ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది.