: రాజమౌళీ గారూ, గర్వపడేలా చేశారు.. ధన్యవాదాలు!: మహేష్ బాబు
ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన 'బాహుబలి-2' సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. రూ. 1000 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా 'బాహుబలి-2' రికార్డులు క్రియేట్ చేసింది. ఈ అద్భుత విజయం పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. "ఊహించనిది జరిగింది. రూ. 1000 కోట్లు. ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. నాతో పాటు మొత్తం తెలుగు సినీ రంగం గర్వించేలా చేసిన రాజమౌళి, యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశాడు.