: 'బాహుబలి-2' పైరసీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరో విశాల్
భారీ బడ్జెట్ తో తెరకెక్కి, ఇప్పటికే రూ. 1000 కోట్లను కొల్లగొట్టిన 'బాహుబలి-2' సినిమాకు పైరసీ కష్టాలు తప్పలేదు. ఈ సినిమాకు సంబంధించిన సీడీలు ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్నాయి. అంతేకాదు, కొన్ని వెబ్ సైట్స్ ఈ సినిమాను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశాయి. దీంతో ప్రముఖ హీరో, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ఈ సినిమాను ఆన్ లైన్లో ఉంచిన కొన్ని వెబ్ సైట్స్, వాటి ఐపీ వివరాలను పోలీసులకు అందించాడు. ఈ సైట్ల నిర్వాహకులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విశాల్ కోరారు. నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా విశాల్ ఎన్నికైన వెంటనే... యాంటీ పైరసీ సెల్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.