: నాపై వీరిద్దరి ప్రభావమే ఎక్కువ: ప్రియాంక చోప్రా
తనపై మహాత్మాగాంధీ, దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా తెలిపింది. వీరిద్దరూ చిన్నారుల హక్కుల కోసం పోరాడారని చెప్పారు. జొహానెస్ బర్గ్ లో యూనిసెఫ్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ప్రియాంక చోప్రా హాజరయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో ప్రతి ఐదుగురిలో ఒకరు, జింబాబ్వేలో ముగ్గురు లైంగిక దాడులకు గురయ్యారని చెప్పారు. తాను ఎలాంటి దుస్తులు ధరించాననే విషయాలను కాకుండా... ఇలాంటి విషయాలపై మీడియా దృష్టిని సారిస్తే బాగుంటుందని సూచించింది. యూనిసెఫ్ సౌహార్ద రాయబారిగా ప్రియాంక చోప్రా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.