: నోరూరించనున్న సీఎం యోగి మామిడిపండ్లు!


యూపీ డైనమిక్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరుతో మామిడిపండ్లు రాబోతున్నాయి. మ్యాంగో మ్యాన్ గా పేరు ప్రఖ్యాతులుగాంచిన హజీ కలిముల్లా (74) వీటిని పండిస్తున్నారు. గతంలో కూడా ఈయన అభివృద్ధి చేసిన మామిడిపళ్లకు ఐశ్వర్యరాయ్, సచిన్ టెండూల్కర్ ల పేర్లను పెట్టారు. యూపీలోని మలిహాబాద్ కు చెందిన ఈయన 1957 నుంచి ఐదెకరాల్లో మామిడితోటను సాగు చేస్తున్నారు. ఈ తోటలోనే పలు ప్రయోగాలు చేస్తూ, రకరకాల కొత్త వంగడాలను సృష్టించారు. ఒకే చెట్టుకు 300 రకాల మామిడి పండ్లను కాచేలా చేసిన ఘనత ఈయనది. ఈయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఉత్తరప్రదేశ్ సర్కారు 'ఉద్యాన్ పండిత్' బిరుదుతో సత్కరించింది. 

  • Loading...

More Telugu News