: రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మంచి విజయం సాధిస్తారు: నటి నగ్మా
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెడితే కనుక మంచి విజయం సాధిస్తారని అఖిల భారత మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సీనియర్ నటి నగ్మా అన్నారు. చెన్నైలో రజనీకాంత్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశానని నగ్మా తన ట్వీట్ లో పేర్కొన్నారు. తనకు ఇష్టమైన నటుడు, 'బాషా' సినిమా నుంచి తనకు మంచిమిత్రుడైన రజనీకాంత్ ను నిన్న కలిశానని, పలు అంశాలపై తాము చర్చించుకున్నామని ఆమె తెలిపారు.