: ఢిల్లీ పర్యటనకు వెళుతున్న నారా లోకేష్
చిన్న వయసులోనే రాష్ట్ర మంత్రిగా బాధ్యతలను చేపట్టిన నారా లోకేష్... తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తాజాగా మంత్రి హోదాలో ఆయన తొలిసారి రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే గడపనున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, ఐటీ కంపెనీల సీఈవోలతో ఆయన భేటీ కానున్నారు. మంత్రిగా ఢిల్లీ పర్యటనకు లోకేష్ వెళుతుండటంతో... సర్వత్రా ఆసక్తి నెలకొంది.