: కేజ్రీవాల్ మెడకు ట్యాంకర్ల ఉచ్చు... విచారించాలని ఏసీబీకి ఆదేశాలు


ఢిల్లీలో మంచినీటి సరఫరా నిమిత్తం ట్యాంకర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించిన వేళ, జరిగిన కుంభకోణం ఇప్పుడు కేజ్రీవాల్ మెడకు చుట్టుకుంది. ట్యాంకర్ల యజమానుల నుంచి రూ. 2 కోట్లను కేజ్రీవాల్ లంచంగా తీసుకున్నారని, అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని, మంత్రి పదవి నుంచి తొలగించబడ్డ కపిల్ మిశ్రా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం తన వద్ద ఉన్న ఆధారాలను ఏసీబీకి అందించిన ఆయన, ఆపై లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. మిశ్రా ఫిర్యాదుపై స్పందించిన ఎల్జీ, ఈ కేసులో వచ్చిన ఆరోపణలపై వెంటనే విచారణ ప్రారంభించాలని ఆదేశించారు. దర్యాఫ్తును ప్రారంభించి, ఏడు రోజుల్లోగా నివేదికను తన ముందుంచాలని ఏసీబీ విభాగానికి ఆయన సూచించారు. కాగా, ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై కేజ్రీవాల్ ఇంతవరకూ స్పందించక పోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News