: తప్పుడు సలహాలు వింటున్న పవన్ వైఖరి మారాలి: టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్


ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని విమర్శించేలా నటుడు పవన్ కల్యాణ్ కు ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. తప్పుడు సలహాలు విని విమర్శలకు దిగుతున్న పవన్, తన వైఖరిని మార్చుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. ఐఏఎస్ లకు కులం, మతం, ప్రాంతం ఉండవని, వారు దేశంలో ఎక్కడైనా పని చేయవచ్చన్న కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడటం తగదని హితవు పలికారు. నిన్నటి వరకూ తమిళనాడు చీఫ్ సెక్రటరీగా తెలుగు వ్యక్తి పనిచేశారని గుర్తు చేశారు. దేశాన్ని చీల్చేలా, ప్రజల్లో అభద్రతాభావం పెరిగేలా బాధ్యతగల పవన్ మాట్లాడటం సరికాదని అన్నారు.

  • Loading...

More Telugu News