: దక్షిణ భారతీయుడే టీటీడీ ఈవో బాధ్యతలు నిర్వర్తించాలని రాజ్యాంగంలో ఉందా?: పవన్ కల్యాణ్ కు వర్ల రామయ్య ప్రశ్నలు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం లేదా? అని టీడీపీ నేత వర్ల రామయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాది, దక్షిణాది అని విభజించవద్దని హితవు పలికారు. పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో తమకు మద్దతిచ్చాడని, అయినంత మాత్రాన ఎలా పడితే అలా మాట్లాడితే సరిచేయకుండా ఉండలేమని ఆయన తెలిపారు.

టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి దక్షిణ భారతీయులకు మాత్రమే అని ఎక్కడైనా చట్టంలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అనిల్ కుమార్ సింఘాల్ సమర్థుడైన ఆఫీసర్ అని ఆయన చెప్పారు. ఆయన సరిగా పని చేయకపోతే ఎప్పుడైనా ఆయనను తొలగించవచ్చని ఆయన తెలిపారు. అది మన చేతుల్లోనే ఉన్న వ్యవహారమని ఆయన తెలిపారు. గతంలో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉత్తరభారత రాజకీయాల్లో చక్రం తిప్పారని అన్నారు. ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేస్తే...ప్రజలంతా హర్షించేలా ఉండాలని ఆయన సూచించారు. నేను దక్షిణ భారతీయుడనని ఎక్కడా అనవద్దని ఆయన తెలిపారు. ఉత్తరాదిలో కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా మన వీరయ్య చౌదరి విధులు నిర్వర్తించడం లేదా? అని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News