: కాలిఫోర్నియా కాదు... అమరావతిలా ఉంది: అపూర్వ స్పందనతో చంద్రబాబు అమితానందం!
ప్రస్తుతం యూఎస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, శాన్ జోస్ లో తెలుగువారి నుంచి తనకు లభించిన అపూర్వ స్వాగతానికి ముగ్ధుడయ్యారు. ముఖంలో అమితానందం కనిపిస్తుండగా, వారిని ఉద్దేశించి తెలుగులో మాట్లాడారు. చంద్రబాబు ప్రసంగిస్తున్నంత సేపూ హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఇక్కడ తెలుగు ప్రజలను చూస్తుంటే, తాను కాలిఫోర్నియాలో ఉన్నట్టు అనిపించడం లేదని, అమరావతిలో ఉన్నట్టుందని అన్నారు. తన సమావేశానికి మేయర్ సహా ప్రజా ప్రతినిధులు ఎంతో మంది హాజరయ్యారంటే, ఈ ప్రాంతంలో సేవలందిస్తున్న తెలుగు వారి గొప్పదనమే కారణమని అన్నారు. బిల్ గేట్స్ వంటి ఇక్కడి ప్రముఖులతో తాను స్నేహం చేయబట్టే మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఏపీకి వచ్చాయని గుర్తు చేశారు.