: మరోసారి అమెరికాను రెచ్చగొట్టిన కిమ్ జాంగ్


అమెరికాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ రెచ్చగొట్టే చర్యలు మాత్రం తగ్గడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇరు దేశాల మధ్య ఉద్రక్తతలు పెరుగుతున్నాయే తప్ప, తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన కిమ్ హక్ సాంగ్ అనే మరో వ్యక్తిని ఉత్తర కొరియా అరెస్ట్ చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే కారణాలతో ఇతడిని శనివారంనాడు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో కూడా ప్యాంగ్ యాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థి కిమ్ శాంగ్ డక్ ను అరెస్ట్ చేశారు. కిమ్ హక్ సాంగ్ కూడా ఇదే యూనిర్శిటీలో చదువుతున్నాడు. ఈ అరెస్ట్ విషయాన్ని ఉత్తర కొరియా పత్రికలు ప్రచురించాయి.

ఓ వైపు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.... ఇప్పటి వరకు నలుగురు అమెరికన్ పౌరులను కిమ్ జాంగ్ అరెస్ట్ చేయించి, జైల్లో పెట్టించారు. తమపై అమెరికా దాడులు జరపకుండా నిలువరించేందుకే కిమ్ జాంగ్ ఇలాంటి అరెస్టులు చేయిస్తున్నారని... ఒకవేళ అమెరికా దాడికి దిగితే, వీరిని అడ్డం పెట్టుకుని బేరసారాలు కొనసాగించే ఆలోచన కిమ్ కు ఉండవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News