: ఇంత కుట్ర చేస్తారా?: జగన్ పై లోకేశ్ ఫైర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్న వేళ, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రం పరువు తీసేలా వైకాపా అధినేత జగన్ కుట్రలు చేస్తున్నారని మంత్రి లోకేశ్ నిప్పులు చెరిగారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, సమస్యలను అధిగమించేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించకుండా, అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ ఆలోచిస్తున్నారని, ఇప్పుడు ఆయన కుట్ర బహిర్గతమైందని అన్నారు. చంద్రబాబు అమెరికా పర్యటన ద్వారా పెట్టుబడులు వస్తే, తాను రాజకీయంగా సమాధి కావాల్సిందేనన్న ఆలోచనతోనే జగన్ కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ పద్ధతిని విడిచిపెట్టి నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను వైకాపా పోషించాలని సలహా ఇచ్చారు.