: ఈవీఎంలపై తొలి ఫోరెన్సిక్ పరీక్షలు... బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపాలని బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుణెలోని పార్వతి నియోజకవర్గం బూత్ నంబర్ 185లో వాడిన మెషీన్లను పరీక్షలకు పంపి, వీటిని ట్యాంపర్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అన్న విషయాన్ని పరిశీలించాలని ఆదేశించింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభయ్ చహజీద్, ఈవీఎంల ట్యాంపరింగ్ పై కోర్టును ఆశ్రయించగా, విచారించిన కోర్టు మెషీన్లను హైదరాబాద్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపుతూ తొమ్మిది ప్రశ్నలను సంధించి, వాటికి సమాధానాలు తెలియజేయాలని ఆదేశించింది. ఫోరెన్సిక్ అధికారులు తమ నివేదికను 15వ తేదీ లోగా అందించాలని పేర్కొంది. కాగా, ఇండియాలో ఈవీఎంలపై ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం ఇదే తొలిసారి.

More Telugu News