: నారాయణరెడ్డికి జగన్ నివాళి.. కుటుంబసభ్యులకు పరామర్శ
మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి పార్థివదేహానికి వైసీపీ అధినేత జగన్ నేడు నివాళి అర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. నారాయణరెడ్డి నిన్న అనంతపురంలో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నారాయణరెడ్డికి అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గురునాథ్ రెడ్డి సోదరుడు. వారి స్వగ్రామం పెనకలపాడులో ఈరోజు నారాయణరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.