: పోలీసులపై దాడి కేసులో టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
విధినిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడమే కాకుండా, వారిపై దాడికి దిగారన్న ఆరోపణలపై తెలుగుదేశం నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదైంది. గుండుగొలనులో ట్రాఫిక్ ఏఎస్సై పాపారావుపై దాడి చేసిన కేసులో ప్రభాకర్ పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 323, 353, 506 సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు పోలీసు అధికారులు తెలిపారు. గతంలో గుండుగొలను వద్ద ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పనుల్లో ఉన్న పాపారావుపై ప్రభాకర్ దాడి చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పాపారావు ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన దెందులూరు పోలీసులు ఆయన దాడి చేశారనడానికి ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని గుర్తించి, కేసు నమోదు చేశారు.