: జస్టిన్ బీబర్ కోసం త్యాగం చేసిన సల్మాన్ ఖాన్
పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ఇండియా టూర్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ త్యాగం చేయాల్సి వచ్చింది. ఎవరికైనా సహాయం చేసేందుకు ముందుండే సల్మాన్ ఖాన్... తన ప్రధాన సెక్యూరిటీ గార్డును త్యాగం చేశాడు. బీబర్ షో ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు, బీబర్ కు సెక్యూరిటీ కోసం సల్మాన్ ఖాన్ ను సంప్రదించారు. సల్మాన్ ప్రధాన బాడీ గార్డు షెరాను బీబర్ కోసం మూడు రోజులు తమకు అప్పగించాలని కోరారు. దీంతో సల్మాన్ సరే అన్నాడు. దీంతో నిర్వాహకులు షెరాను బీబర్ కు సెక్యూరిటీ గార్డుగా నియమించారు. ఈ సందర్భంగా సల్మాన్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. కాగా, సల్మాన్ దగ్గర షెరా గత కొన్నేళ్లుగా సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.