: హైదరాబాదులో హంతకుడిని కత్తులతో పొడిచి హతమార్చిన దుండగులు
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు హత్య కేసుల్లో నిందితుడైన మహ్మద్ అమీర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలతో అమీర్ పై దాడి చేసిన ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.