: మైదానంలో ఫుల్ సీరియస్... మైదానం వీడితే మాత్రం డేవిడ్ వార్నర్ తీరు వేరు!


మైదానంలో ఎప్పుడు చూసినా ఆస్ట్రేలియా ఆటగాడు, ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ చాలా సీరియస్ గా కనిపిస్తుంటాడు. అసాధారణంగా తప్ప, సాధారణంగా అతని ముఖంలో నవ్వు కనిపించదు. అలాంటి వార్నర్ స్టేడియం బయట ఎలా? ఎవరితో ఉంటాడో తెలుసా? కుటుంబ సభ్యులతోనే ఉంటాడు... అవును డేవిడ్ వార్నర్ కంప్లీట్ ఫ్యామిలీ మేన్...

బయటి వారితో సరదాగా గడిపేందుకు పెద్దగా ఆసక్తి చూపని వార్నర్... కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతాడు. తాజాగా, భార్య క్యాండిస్‌, పెద్ద కుమార్తె అయివీ మేతో క‌లిసి ఉన్న ఫొటోను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసిన వార్న‌ర్ “నేనెక్క‌డికి వెళ్లినా నా ఫ్యామిలీ నాతో ఉండాలని అనుకుంటాను. చిన్న కూతురు ఇండిరేను తీసుకొద్దామంటే ఇక్క‌డి ఎండ‌లు చాలా ఎక్కువ‌గా ఉన్నాయి” అని పేర్కొన్నాడు. కుటుంబంతో బయటకు వెళ్లేందుకు ఇష్టపడే వార్నర్...వారితో ఉంటే మాత్రం నవ్వుతూ తుళ్లుతూ ఉంటాడు.

  • Loading...

More Telugu News