: అత్తారింటికి రిక్షాలో వెళ్లిన మహోన్నతుడు దామోదరం సంజీవయ్య!: సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి
ముఖ్యమంత్రిగా పనిచేసినా సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేని దామోదరం సంజీవయ్య.. పదవీకాలం ముగియగానే రిక్షాలో అత్తారింటికి వెళ్లిన మహోన్నతుడని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి కొనియాడారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన సంజీవయ్య వర్ధంతి సభకుకు రామస్వామి హాజరై మాట్లాడారు. గొప్ప పాలనా దక్షత కలిగిన సంజీవయ్య లాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మాజీ మంత్రి జి.వినోద్ మాట్లాడుతూ 1969 నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో తన తండ్రి వెంకటస్వామి.. సంజీవయ్యతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. సంజీవయ్య తనలాంటి ఎందరికో ఆదర్శప్రాయమని బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.