: 50 మంది ఆఫ్ఘనిస్థాన్ సైనికులను చంపిన పాకిస్థాన్


పాకిస్థాన్ సైన్యం దుశ్చర్యలు కేవలం భారత సరిహద్దుల్లోనే కాకుండా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో కూడా కొనసాగుతున్నాయి. అఫ్గానిస్థాన్‌ కు చెందిన 50 మందికిపైగా సైనికులను హతమార్చినట్లు పాకిస్థాన్‌ సైన్యం ప్రకటించింది. సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో పది మంది పాక్‌ పౌరులు మృతిచెందారు. దీంతో అప్పటి నుంచి ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ లోని తమ దేశ పౌరులపై అఫ్గాన్‌ బలగాలు జరిపిన కాల్పులను తిప్పికొట్టామని, ఈ క్రమంలో ఆఫ్ఘాన్ కు చెందిన 50 మందికిపైగా సైనికులను మట్టుబెట్టగా, వంద మందికిపైగా సైనికులు గాయాలపాలయ్యారని  పాక్‌ మేజర్‌ జనరల్‌ నదీం అహ్మద్‌ తెలిపారు. దీనిని ఆప్ఘనిస్థాన్ ఇంకా నిర్ధారించలేదు. 

  • Loading...

More Telugu News