: ఢిల్లీ విమానాశ్రయంలో ఒకదాన్నొకటి ఢీకొన్న విమానాలు.. తప్పిన పెను ప్రమాదం!
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న జెట్ ఎయిర్‌వేస్ విమానాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. శ్రీనగర్ వెళ్లేందుకు జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా దాని తోక భాగంలోని రెక్క.. పట్నా వెళ్లేందుకు రెడీ అవుతున్న మరో జెట్ ఎయిర్‌వేస్ విమానానికి తాకింది. దీంతో శ్రీనగర్ వెళ్లాల్సిన విమానం రెక్కభాగం స్వల్పంగా దెబ్బతింది. దీంతో రెండు విమానాలను తిరిగి పార్కింగ్ ప్లేస్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ క్షేమమని ఎయిర్‌పోర్ట్ డీసీపీ సంయ్ భాటియా తెలిపారు.