: శభాష్ రాజమౌళి...తెలుగు సినీ పరిశ్రమ గర్విస్తోంది: పవన్ కల్యాణ్
ప్రముఖ దర్శకుడు రాజమౌళిని జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభినందించారు. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం పట్ల ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కృషి, పట్టుదలతో అద్భుతమైన సినిమాను రూపొందించిన రాజమౌళి తెలుగువారిని గర్వపడేలా చేశారని ఆయన కొనియాడారు. ఇలాంటి విజయాలు రాజమౌళికి మరిన్ని దక్కాలని ఆయన అభిలషించారు. కాగా, 1000 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' నిలవడం విశేషం. ఈ విషయాన్ని ఆర్కా మీడియాతో పాటు, బాహుబలి టీమ్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.