: అప్పుడు, ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: నటుడు బాబూమోహన్


తమ పెద్దబ్బాయి చనిపోవడంతో ఆ బాధ భరించలేకపోయానని, అప్పుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని సీనియర్ సినీ నటుడు బాబూమోహన్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నా పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. ఓ వెలుగు వెలిగాను, ఇక చాలులే, తొందరగా చచ్చిపోతే, నా కొడుకు దగ్గరకు వెళ్లిపోవచ్చు, వాడితో ఆడుకోవచ్చు అని అనుకునేవాడిని. ఒక రోజున నాకే అనిపించింది, ఎంతో మందికి సాయం చేశాను, నేను ఎందుకు చనిపోవాలని అనిపించింది.

మా పెద్దబ్బాయి చనిపోయిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడినే కాదు, మూడు నెలల పాటు నేనున్న గది తలుపులు కూడా వేసే ఉంచేవాడిని.. ఏడుస్తూ ఉండేవాడిని. ఇంట్లో ఎవరి గదిలో వారు అదే విధంగా ఉండేవారు. లైట్లు కూడా వెలిగించే వాళ్లం కాదు. ఆల్మోస్ట్ చీకట్లో ఉన్నట్లే ఉండేవాళ్లం. ఒకరోజు ఎందుకో, ఇంట్లో నుంచి బయటకు వస్తే, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణగారు నన్ను పిలిచారు. ఎంతో యాక్టివ్ గా ఉండే నన్ను అలా చూసి ఆయన బాగా ఫీలయ్యారు. ‘ఎవడిగోల వాడిది’ షూటింగ్ ఉంది, బ్యాంకాక్ వెళ్లిపోదాం, రెండు నెలలు ఉండొద్దాం’ అని తీసుకువెళ్లారు. అలా, ఎంత మరిచిపోలేని విషయాలనైనా, గుంపులో పడితే మార్పు వస్తుందని తెలుసుకున్నాను’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News