: ఆ రోజున రామ్ గోపాల్ వర్మకు భోజనం పెట్టి పంపించాం: దేవినేని అవినాష్
‘వంగవీటి’ చిత్రం సినిమా కథ వ్యవహారంలో తామెవ్వరమూ తలదూర్చలేదని విజయవాడ టీడీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆ రోజున రామ్ గోపాల్ వర్మ తమ ఇంటికి వస్తానంటే, రమ్మన్నామని, మర్యాదపూర్వకంగా భోజనం పెట్టి పంపించాము తప్పా, ‘వంగవీటి’ కథ ఫలానా విధంగా ఉండాలని, మమ్మల్ని హీరోగా చూపించాలని తామేమి ఆయనకు చెప్పలేదని, ఏనాడూ కూడా వర్మను ఆ విధంగా అడగలేదని చెప్పారు.